Saturday, September 19, 2026
No menu items!
HomeNationalపాండ్యా డబుల్ ధమాకా.. కొత్త గర్ల్‌ఫ్రెండ్..!

పాండ్యా డబుల్ ధమాకా.. కొత్త గర్ల్‌ఫ్రెండ్..!

📰 Generate e-Paper Clip

పాండ్యా డబుల్ ధమాకా.. కొత్త గర్ల్‌ఫ్రెండ్..!

 

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అటు మైదానంలోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి వార్తల్లో నిలిచిన పాండ్యా, అంతకుముందే దేశవాళీ క్రికెట్‌లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. మంగళవారం (జనవరి 6) ముంబైలోని కలినా విమానాశ్రయం వద్ద పాండ్యా తన సరికొత్త లగ్జరీ కారు ‘లంబోర్ఘిని ఉరస్ SE’లో ప్రత్యక్షమయ్యాడు.అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది పాండ్యా ఒక్కడే కాదు.. అతని పక్కనే ఉన్న గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ కూడా.

ముంబై ప్రైవేట్ టెర్మినల్ వద్ద ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. హార్దిక్, మహీకా ఇద్దరూ తెల్లటి టీ-షర్టులు ధరించి ‘ట్విన్నింగ్’ఔట్‌ఫిట్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు మహీకాను హార్దిక్ పరిచయం చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ దాదాపు ఖాయమైందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

విజయ్ హజారేలో ‘హార్దిక్’ సునామీ!

వ్యక్తిగత జీవితం పక్కన పెడితే, క్రికెట్ మైదానంలోనూ పాండ్యా మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బరోడా తరపున ఆడుతున్న హార్దిక్, విదర్భపై వీరవిహారం చేశాడు.కేవలం 92 బంతుల్లోనే 133 పరుగులు బాది లిస్ట్-ఏ క్రికెట్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో విదర్భ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. హార్దిక్ ఫామ్ చూసి టీమిండియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page