ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్
బీజేపీ డీఎన్ఏ నే బీసీలకు, దళితులకు వ్యతిరేకం
బిజెపి పాలిత రాష్ట్రాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతుంది
అసెంబ్లీలో జ్యోతిభాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి
– భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 8, అద్దం న్యూస్ : అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది, అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ శాంపుల్ మాత్రమేనని.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. మీలా దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు చేయమన్నారు. బీజేపీ డీఎన్ఏ నే బీసీలకు, దళితులకు వ్యతిరేకమని, ఇప్పటికి బిజెపి పాలిత రాష్ట్రాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతుందని ఆమె ధ్వజమెత్తారు. దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత , కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారాం జుల్లి శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారని.. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరమని కవిత అన్నారు. అసెంబ్లీలో జ్యోతిభాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ( యూపీఎఫ్ ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ కవిత హాజరై మాట్లాడుతూ… దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి కానీ, చేతల్లో చూపించాలి అని తెలిపారు. అయోధ్య రాముడి గుడి కడితే బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదన్నారు. గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముందన్నారు. బాన్సువాడ ప్రాంతంలో ఒక చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉందని, బీసీలు, ఎస్సీలకు వేరే కప్పుల్లో చాయ్ పోసే పరిస్థితి అక్కడ ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికీ అవమానాలు జరుగుతున్నాయని, బీసీల కోసం ఎందుకు ధర్నాలు చేస్తున్నారని కొంత మంది ప్రశ్నిస్తున్నారన్నారు. బీసీల సమస్యల పట్ల ఆవేశం, ఆవేదన నుంచి పుట్టికొచ్చినవే ఈ ధర్నాలు ఈబ్ల్యూఎస్ అమలుతో 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగిపోయింది.. కాబట్టి 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించినా కోర్టులు అడ్డుకోలేవన్నారు. బీసీ బిల్లుల ఆమోదానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. బీసీలను మభ్యపెట్టవద్దు…రెండు బిల్లులను ఆమోదించేలా ప్రయత్నం చేయాలన్నారు. బీజేపీ డీఎన్ఏ నే బీసీలకు, దళితులకు వ్యతిరేకమని.. అటువంటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలే మనకు మార్గమన్నారు. జ్యోతిబా పూలేను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ ఆయన బాటలో నడిచారని.. కుల వివక్ష తొలగింపునకు జ్యోతిబాఫూలే తీవ్ర కృషి చేశారని కవిత తెలిపారు.
పొద్దుపోక విగ్రహం పెట్టాలని అడుగుతలేమని.. ఆయన స్ఫూర్తిగా నిలవాలని అడుగుతున్నామన్నారు. 15 ఏళ్ల కింద అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని కూడా డిమాండ్ చేశామని.. అప్పుడు కూడా చిన్నచూపు చూశారన్నారు. అంబేద్కర్ విగ్రహం పక్కన జ్యోతిబాపూలే విగ్రహం పెట్టాలన్నారు. ఏప్రిల్ 11 తేదీ నాడు ఆయన జయంతి రోజున జ్యోతిబాపూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని, 42 శాతం రిజర్వేషన్లు పాసైన బిల్లు పాస్ చేసి నాలుగు వారాలు గడిచిందని.. ఆ బిల్లు ఎవరి దగ్గర ఉందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి పార్టీని కాపాడడానికి ఆ బిల్లు కేంద్రానికి పంప లేదన్నారు. బిల్లు పంపి ఉంటే అపాయింట్‌మెంట్ వస్తుండే అని.. బీజేపీతో లాలూచీ లేకపోతే బిల్లు ఆమోదం అయ్యే విధంగా చూడాలన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ తో హెచ్‌సియు విద్యార్థులను కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో పదేళ్ల క్రితం కుల గణన చేసి చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయంగా పోరాడితే నీతో కలిసి పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఈ ధర్నాలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జైసింహా, భారత జాగృతి ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ పరకాల మనోజ్‌కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


