భద్రకాళి దేవాలయంలో ఎయిర్‌టెల్ రాజు పూజలు


హైదరాబాద్, జులై 12, అద్దం న్యూస్ : ముషీరాబాద్ మహంకాళి దేవాలయం మాజీ ఛైర్మన్ ఎయిర్‌టెల్ రాజు ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు జరిగాయి. ఈ పూజలకు పద్మశాలి సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్, గణేష్ దేవాలయం మాజీ ఛైర్మన్ జయరాజ్, ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం భద్రకాళి దేవాలయానికి వచ్చిన కళాకారులను అభినందించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply