అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సెన్సేషన్ ‘అఖండ-2: తాండవం’ (Akhanda 2) ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 9 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సనాతన ధర్మ పరిరక్షణ ఇతివృత్తంగా తెరకెక్కింది. కుంభమేళా నేపథ్యంలో దేశంపై శత్రువులు పన్నిన ‘బయోవార్’ (Bio-war) కుట్రను అఘోరా పాత్రలో బాలయ్య ఎలా తిప్పికొట్టారనేది ఈ సినిమా (Akhanda 2) కథాంశం. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, ఆయన సరసన సంయుక్త మీనన్ నటించారు. ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో మెప్పించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, బాలయ్య మార్క్ డైలాగులు, అఘోరా గెటప్ కోసం ఈ సినిమాను (Akhanda 2) ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండగ సెలవుల్లో వినోదాన్ని పంచేందుకు అఖండ-2 సరైన ఎంపికగా నిలవనుంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply