...

Ashes 2025-26: ఇంగ్లాండ్‌ ఆలౌట్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా అయిదో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. 211/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు 97.3 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌటైంది. 78 పరుగులతో రెండోరోజు క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్‌ 84 రన్స్‌ వద్ద పెవిలియన్‌కు చేరాడు. తొలి రోజు 72 పరుగులు చేసిన జోరూట్‌ రెండో రోజు భారీ శతకం (160; 242 బంతుల్లో, 15 ఫోర్లు) సాధించి ఔటయ్యాడు. వీరిద్దరూ 208 బంతుల్లో 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టెస్టుల్లో రూట్‌కు ఇది 41వ సెంచరీ. ఈ శతకంతో అతడు రికీపాంటింగ్‌ సరసన నిలిచాడు.

రికీపాంటింగ్‌ సరసన నిలిచిన జో రూట్‌

బెన్‌స్టోక్స్‌ (0) బ్యాటింగ్‌లో నిరాశ పరిచాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జెమ్మీస్మిత్‌ 46 (78 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్స్‌), విల్‌ జాక్స్‌ 27 (62 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ నీసర్‌ 4, మిచెల్‌ స్టార్క్‌, స్కాట్‌ బోలాండ్‌ తలో రెండు, కామెరూన్‌ గ్రీన్, లబుషేన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.