Pushpa 2: ఎమోషనల్ జర్నీ..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ‘పుష్ప 2’ (Pushpa 2) విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లో ఈ సినిమా మైలురాయి. దాదాపుగా రూ.1,740 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీసుని రూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేశాయి. అయితే ఇంత పెద్ద విజయాన్ని బన్నీ మనసారా ఆస్వాదిం చలేకపోయాడు. ఈ మూవీ సక్సెస్అయన జీవితంలో ఒక పీడకలగా మారింది. దుర దృష్టవశాత్తూ జరిగిన ఓ ఘటన కారణంగా ఓ నిండిప్రాణం పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘పుష్ప’ విడుదలై ఏడాది కంప్లీట్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “పుష్ప” మా లైఫ్ లో ఐదేండ్ల పాటు సాగిన మరువలేని ప్రయాణంగా నిలిచింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ, శక్తి, మాకళను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవసరమైన ధైర్యాన్ని అందించింది.

ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చినందుకు ఈ దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న.. ప్రతి ఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞు లమై ఉంటాం. నా సహచర ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్. మొత్తం యూనిట్, ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్, అఫ్ కోర్స్ మరీ ముఖ్యంగా మా కెప్టెన్ సుకుమార్ తో కలిసి ఈ ప్రయాణంలో నడవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. మరోసారి. హృదయం నిండా కృతజ్ఞతతో థ్యాంక్యూ’ అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page