హైదరాబాద్, అద్దం న్యూస్ : జలమండలిలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జలమండలి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన కొన్ని వర్గాల ప్రజలకే కాదు.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అని వివరించారు. రాజకీయ నాయకుడిగా, ఆర్థిక వేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన మన దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఈడీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. రాజ్యాంగం వల్లే అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నాయన్నారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ రూపొందించిన జీవించే హక్కు, చదువుకునే హక్కు లాంటి వల్లే.. చాలా మంది మెరుగైన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పారు. మనమంతా ఆయన చూపిన పథంలో నడవాలని ఆకాంక్షించారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ సమన్వయకర్త సీజీఎం పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ- ఆపరేషన్స్ -2 డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ -1 డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎంలు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రభు, నాగేందర్, నారాయణ, సుజాత, జీఎంలు, జలమండలి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 
జలమండలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply