హైదరాబాద్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ కృష్ణానగర్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బస్తీ అధ్యక్షుడు వై.శాంతికుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి, ఆ పక్కనే ఉన్న బాబూ జగ్జీవవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బస్తీ ఉపాధ్యక్షుడు, పోచమ్మ గుడి చైర్మన్ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి స్వామిరావు, కోశాధికారి సుదర్శన్, రాము, నవీన్, నరేష్, బస్తీవాసులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply