హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : పార్టీ కోసం అహర్నిషలు పని చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహకు ఆ పార్టీ నాయకులు సన్మానించారు. ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలో ముఠా జైసింహకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ముఠా జైసింహకు గజమాల వేసి, శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండా సహదేవ్, భాషపాక శ్రీనివాస్, భాస్కర్ నేత, శ్రీధర్‌గౌడ్, టిల్లు, బియ్యం శ్రీనివాస్, మోయిన్, సత్యనారాయణ బాబు, శ్రీకాంత్ యాదవ్, నక్క మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply