జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించిన అన్విత్
హైదరాబాద్, ఆగస్టు 06, అద్దం న్యూస్ : బెంగళూర్‌లో ఇటీవల జరిగిన 13వ షోటోఖాన్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ చైతన్య స్కూల్ బర్కత్‌పుర బ్రాంచ్ 8 వ తరగతి విద్యార్థి లక్కాకుల అన్విత్ పటేల్ తెలంగాణ రాష్ట్రం తరపున జీవీఆర్ కరాటే అకాడమీ ద్వారా కటా, కుమితి విభాగాల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. అకాడమి విద్యార్థులతో కలిసి ఓవరాల్ ఛాంపియన్ షిఫ్ ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం బర్కత్‌పురలోని శ్రీ చైతన్య స్కూల్‌లో ప్రిన్సిపాల్ రూబీనా విద్యార్థి అన్విత్ ను సత్కరించి అభినందించారు. స్కూల్ డీన్.రమేష్, సి బ్యాచ్ ఇంచార్జ్ గాయాత్రి, టీచర్స్ కె.క్రిష్ణకుమారి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply