సికింద్రాబాద్, అద్దం న్యూస్ : తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం వారాసిగూడ చౌరస్థాలో టిడిపి బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు గరిగే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ఆ పార్టీ సికింద్రాబాద్ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. దూరదృష్టి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో కీలకమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమగ్ర అభివృద్ధి ఆయన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, వెంకటస్వామి, నరేంద్ర, టెంట్ హౌస్ శంకర్, పిట్ల శంకర్ ముదిరాజ్, పొట్టిశీను, చంద్రమోహన్, దేవేందర్, సుధాకర్, రవి, చిరంజీవిరాజు, చందర్ ముదిరాజ్, నాయుడు, పుప్పాల విజయ్ కుమార్, రాహుల్, డెంటల్ ప్రవీణ్, సీనియర్ నాయకురాలు శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply