హైదరాబాద్ జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యుడిగా ముదిగొండ మురళి నియామకం
హైదరాబాద్, జనవరి 10, అద్దం న్యూస్ : హైదరాబాద్ జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యుడిగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌కు చెందిన ముదిగొండ మురళి నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జి.ఆశన్న కమిటీకి కన్వీనర్‌గా, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా నియామకపత్రాన్ని మురళీ అందుకున్నారు. ఈ సందర్భంగా మురళీని ఎమ్మెల్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముదిగొండ మురళీ మాట్లాడుతూ… దోబీ ఘాట్స్ నిర్మాణం, సబ్సిడీతో కూడిన లోన్లు, డ్రైక్లీన్ షాప్‌లకు ప్రభుత్వం అందించే ఉచిత 250 యూనిట్స్ కరెంటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రజకులకు అందే విధంగా ఈ కమిటీ పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బొమ్మపాల వెంకటయ్య, ఎం.మహేష్, వెంకటేశ్వరరావు, ఆలేటి శ్రీనివాస్, జి.శ్రీనివాస్, బంగారు శ్రీనివాస్, జనార్థన్, సునీల్, సుదర్శన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply