సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అతినగరం సుదేష్‌ నేత

సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అతినగరం సుదేష్‌ నేత

హైదరాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌కు చెందిన అతినగరం సుదేష్‌ నేత నియమితులయ్యారు. ఈ మేరకు నియమకాన్ని సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతినగరం సుదేష్‌ నేత సికింద్రాబాద్ మాజీ ఎంపీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకుగాను అంజన్ కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా అంజ‌న్ కుమార్ యాద‌వ్‌ను సుదేష్ స‌న్మానించారు. ఈ సందర్భంగా అతినగరం సుదేష్‌ నేత మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తను నియమించినందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ బలోపేతానికి త‌న వంతు కృషి చేస్తానన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page