సామాజిక సమానత్వానికి ప్రతీక బాబు జగ్జీవన్ రామ్

సామాజిక సమానత్వానికి ప్రతీక బాబు జగ్జీవన్ రామ్
మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

లాలాపేట్‌, జూలై 6, ( అద్దం న్యూస్ ) :   భారత మాజీ ఉప ప్రధానమంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సోమ‌వారం లాలాపేట్‌లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హాజ‌రై బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్య్ర‌ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించడమే కాకుండా సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక సంస్థల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page