Friday, September 18, 2026
HomeHyderabadనేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను ఆవిష్క‌రించిన...

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను ఆవిష్క‌రించిన బండారు ద‌త్తాత్రేయ‌

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను ఆవిష్క‌రించిన బండారు ద‌త్తాత్రేయ‌

హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ :     నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను హ‌రియాణా మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌లోని బండారు ద‌త్తాత్రేయ నివాసంలో ఆయ‌నను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) క‌మిటీ స‌భ్యులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను బండారు ద‌త్తాత్రేయ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ స‌భ్య‌లంద‌రూ సామాజిక సేవ‌లో ముందుండాల‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేయాల‌ని సూచించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) జాతీయ అధ్య‌క్షుడు కటకం శ్రీనివాస్, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌ల్వ వీరేంద‌ర్ గుప్త లు మాట్లాడుతూ.. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలు చేశామని, ఇక మునుముందు కూడా అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సంద‌ర్భంగా బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సభ్యులకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ప్రధానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ జాతీయ కోశాధికారి స‌రాఫ్ తుల‌సి ర‌జినేష్‌, ముఖ్య స‌ల‌హాదారుడు డాక్ట‌ర్.నీలా శ్రీధ‌ర్‌, మీడియా ఛైర్మ‌న్ అనిల్ కుమార్‌, గుండ శ్రీనివాస్‌, వాడ‌క‌ట్టు శ్రీకాంత్‌, ఎల్లంకి వీరేశం, అజ‌య్ గుప్త‌, మ‌హేష్‌, రాజు గుప్త‌, జ‌బ‌ర్థ‌స్త్ హ‌రిక్రిష్ణ‌, జాతీయ లీగ‌ల్ స‌ల‌హాదారుడు క్రాంతికుమార్‌, స‌భ్యులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page