బీసీల కులగణన ను అమలు చేయడంలో మోడి చేస్తున్న జాప్యంలో మతలబేంటో
» తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు
హైదరాబాద్, ఆగస్టు 24, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బీసీల కులగణనను చేపట్టారని, కానీ కేంద్రంలో బీసీల కులగణనను చేయడంలో ప్రధాన మంత్రి మోడి ఎందుకు జాప్యం చేస్తున్నారని, అందులో మతలబు ఏముందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బీసీల కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేస్తున్న విధానాలకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో వి.హనుమంతరావు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా, ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఎమ్మెల్సి మధుసూదన రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బిసి జేఏసీ చైర్మన్, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బిసి ఇంటలెక్టువల్స్ ఫోరమ్ కన్వీనర్ చిరంజీవులు, బిసి జేఏసీ నాయకుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్ కె.సరిత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం జన గణనలో కులగనన చేపట్టడంలో ఎస్సీ, ఎస్టీలకు పేర్లు పెడుతున్నారు కానీ బీసీల పేర్లు పెట్టడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. ప్రధాని మోడీ కూడా ఓబీసీ అయ్యి బీసీలకు అన్యాయం చేయడం సరికాదన్నారు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో అన్ని కులాలకు లెక్కలు ఉన్నాయి కానీ.. బీసీలు కనిపించడం లేదాని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపట్టి బీసీల కులగణన చేపట్టే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టి లేదని హనుమంతరావు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంటులో బీసీల కులగణన చేపట్టాలని గగ్గోలు పెట్టిందన్నారు. 12 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నారు… కానీ బీసీ ప్రధాని అని చెప్పుకుంటూ బీసీలకు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేటి నుండి రాష్ట్రమంతా పర్యటించి బీసీల కులగణన చేపట్టేంత వరకు వదిలి పెట్టేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సి మధుసూదన చారి, బిసి జేఏసీ చైర్మన్, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ… కులగణన దేశంలోని 80 కోట్ల బీసీల ఆత్మగౌరవ సమస్య, ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. కులాల వారీగా విభజించి ఎవ్వరిని అధికారంలోకి రాకుండా అప్రతిష్టపాలు చేయడం, అవమాన పరచి పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. కులగణన చేయాలని డిక్లేర్ చేయండి అని.. మెజారిటీ వర్గాలు నష్టపోయారని తెలిపి కేరళలో ఆర్ఎస్ఎస్ తీర్మానం చేసిందని.. బీజేపీ పార్టీ కులగణన చేస్తామని డిక్లేర్ చేసిందన్నారు. బీసీల పక్షాన ఎవరైతే ఉండి కులగణన చేసి, రాజ్యాధికారంలో వాటా, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తారో, వారికే బీసీల మద్దతు ఉంటుందన్నారు. సాయుధ పోరాటం, నక్సల్ బరి పోరాటం, తెలంగాణ పోరాటంలో బీసీలే, యువత ముందుండి నడిపించారని, పార్టీ జెండాలు పక్కన పెట్టి ఐక్యం కావాలని. రిజర్వేషన్ల సాధనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోత రోహిత్, కాంగ్రెస్ పార్టీ శంభుల శ్రీకాంత్, ఉషశ్రీ, కోల జనార్ధన్, బిసి సంక్షేమ సంఘం నాయకులు శ్యామ్, లింగం గౌడ్, రావుల్‌కోల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply