కార్పొరేటర్ పావని ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : దసరా సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ వేడుకలు ఆదివారం రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో ఘనంగా జరిగాయి. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రాకేఫ్ చౌరస్తాలో జరిగిన ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కార్పొరేటర్ పావని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలకు హాజరైన సినీ తార అశ్విని శ్రీ, ప్రముఖ యాంకర్ త్రిపుర నిమ్మగడ్డ, ప్రఖ్యాత గాయని మహేశ్వరి, బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌లకు కార్పొరేటర్ పావని సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్ మహిళా మోర్చ నాయకులు సంధ్యా రాణి, మంగమ్మ, విజయలక్ష్మి, సంయుక్త రాణి, పూర్ణ, స్వప్న, నాయకులు, కార్యకర్తలు, భారీసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply