మూసి పరివాహక ప్రాంతాలన్ని మునిగిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోదా
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం అతలాకుతలమై సామాన్యుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతుంటే ప్రభుత్వం పట్టించుకోదా అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… నగరం చినుకు పడితే అల్లకల్లోలమై జనజీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దగ్గర పడుతున్నా ప్రభుత్వం తన తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మొన్నటి వరకు మూసి సుందరీకరణ అంటూ కాల యాపన చేస్తోందన్నారు. ఇప్పుడు దానికి తోడు కొత్తగా ఫ్యూచర్ సిటీ అంటూ ఊదర గొట్టి గొప్పగా కడతామంటూ మరో కొత్త మాట చెప్పి ప్రజల్ని వంచించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైడ్రా, హైడ్రా అంటూ హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాశానికి ఎత్తుకుందన్నారు. హైడ్రాతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, హైడ్రా కేవలం పేదల ఇల్లు కూల్చడానికి మాత్రమే ఉందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ నగరంలో హైడ్రా చేసింది కేవలం ఒకేఒక బతుకమ్మ కుంటను డెవలప్ చేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. మూసి సుందరీకరణకు 15 వేల కోట్లు అని చెప్పారని, దాన్ని పక్కన పెట్టారన్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని, దానికి అన్ని హంగులు అనుసంధానం చేస్తామని, న్యూయార్క్ సిటీని తలపించేలా చేస్తానని గొప్పలు చెప్తున్నారన్నారు. సంవత్సరకాలంగా ఇలాంటి పనికిరాని మాటలు చెపుతూనే ఉన్నారు… కాని చేసిందేమీ లేదన్నారు. మూసి సుందరకరణ మూసీ వరదల్లో కొట్టుకు పోయిందన్నారు. కొత్త రేషన్ కార్డులు అని చెప్పి ఇంత వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చింది లేదన్నారు. లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అంతకు ముందు రైతు రుణమాఫీ అని చెప్పి, రుణమాఫీ ఎవరికి ఇచ్చారో ఎవరికీ తెలీదన్నారు.
మళ్లీ ఎన్నికలు వస్తున్నందున ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జిమ్మిక్కులని, ప్రజలు గ్రహించాలని కోరారు. 30 రూ. గజం ఉన్న భూమిని 300 రూ. గజం చొప్పున చేసి అమ్ముకోవడానికే ఈఫ్యూచర్ సిటీ అని, కాంగ్రెస్ నాయకులకు, తమ బంధువులకు లబ్ధిచేకూర్చే ఉద్దేశంతో చేస్తున్నదే ఫ్యూచర్ సిటీ అని అన్నారు. పరిపాలన అనుభవం లేక జరుగుతున్న వైఫల్యాలేనని సాయిబాబా అన్నారు. ఫ్యూచర్ సిటీ కేవలం మీ ఇలా కడుపులో నింపుకోవడానికి చేస్తున్నా కొత్త నాటకం మాత్రమేనని కొత్త దుకాణమని అన్నారు. వర్షం పడితే నగరం పరిస్థితి ఏంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. భారీ వర్షాల వల్ల మూసి పరివాహక ప్రాంతం బురద మేట వేయడం జరిగిందన్నారు. దాదాపు మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ పూర్తిగా నిరాశలయ్యారని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త దుకాణం తెరిచిందని అన్నారు. ఒక రోజు విశ్వనగరంగా వెలుగొందిన నగరం ఈరోజు దిక్కు దివానం లేక అభాగ్యనగరాన్ని తలపిస్తుందన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. వెంటనే నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించి వారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply