Saturday, September 19, 2026
No menu items!
Homecinemaఅందం డ్రెస్‌లలో ఉంటుంది.. హీరోయిన్‌లపై శివాజీ కామెంట్స్

అందం డ్రెస్‌లలో ఉంటుంది.. హీరోయిన్‌లపై శివాజీ కామెంట్స్

📰 Generate e-Paper Clip

అందం డ్రెస్‌లలో ఉంటుంది.. హీరోయిన్‌లపై శివాజీ కామెంట్స్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లలో ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) అన్నారు. నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవం ఉంటుందన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ (Dhandoraa) డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శివాజీ కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఈవెంట్‌లో యాంకర్‌ డ్రెస్‌ సెన్స్‌ బాగుందని చెప్పిన శివాజీ హీరోయిన్‌ల దుస్తుల గురించి మాట్లాడారు. ‘‘నటీమణులు కొంచెం డ్రెస్‌ సెన్స్ పాటించాలి. ఇలా చెబుతున్నందుకు ఏమనుకోవద్దు. మీ అందం మొత్తం నిండుగా వేసుకొనే దుస్తుల్లోనే ఉంటుంది. ఫ్యాషన్‌ దుస్తులు వేసుకున్నప్పుడు అందరూ బాగున్నాయనే అంటారు. కానీ, లోపల తిట్టుకుంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది (Sivaji Comments on Dress Sense). మా అమ్మ.. అంటే నటి సావిత్రి ఇప్పటికీ నిండైన రూపంతో గుండెల్లో కనబడుతూ ఉంటుంది. అప్పట్లో సౌందర్య ఈ జనరేషన్‌లో రష్మిక చక్కగా ఉంటారు. గ్లామర్‌ ఉండాలి.. కానీ దానికి ఒక హద్దు ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు. ప్రపంచ వేదికలపై కూడా చీర కట్టులో వచ్చినవారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి’’ అని శివాజీ అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page