Saturday, September 19, 2026
No menu items!
HomeNewsకూలిన నేవీ విమానం.. ఐదుగురు మృతి

కూలిన నేవీ విమానం.. ఐదుగురు మృతి

📰 Generate e-Paper Clip

     కూలిన నేవీ విమానం.. ఐదుగురు మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : మెక్సికో నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టెక్సాస్‌లోని గాల్వేస్టోన్‌ కాజ్‌వే వద్ద కుప్పకూలింది (Mexican Navy plane crash). వైద్య సహాయం కోసం వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్న సాంకేతిక లేదా వాతావరణ కారణాల వల్ల మెక్సికో నేవీ విమానం కూలిపోయింది. టెక్సాస్‌లోని గాల్వేస్టోన్ కాజ్‌వే సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో చిన్నారితో పాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే మృతుల్లో చిన్నారి ఉందా లేదా అనేది అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మెక్సికన్‌ అధికారులు తెలిపారు.

ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని వెల్లడించారు. గాల్వేస్టోన్‌ కౌంటీ ఫెరీఫ్‌ కార్యాలయం ప్రమాదంపై స్పందించింది. సహాయక చర్యల కోసం డ్రోన్‌ యూనిట్‌తో సహా రెస్క్యూ సిబ్బంది ఆ స్థలానికి వెళ్లినట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. అయితే, ప్రమాదానికి పొగమంచే కారణమా అనేది స్పష్టంగా పేర్కొనలేదు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో నిండిపోయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page