న్యాయం, స్వేచ్ఛ కోసం పోరాడిన భగత్‌సింగ్ నేటి తరానికి స్ఫూర్తి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

హైదరాబాద్, అద్దం న్యూస్ : బ్రిటిష్ నిరంకుశ పాలనా నుండి న్యాయం, స్వేచ్ఛ కోసం పోరాడిన భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లు నేటి తరానికి స్ఫూర్తి అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. భ‌గ‌త్‌సింగ్ నౌ జవాన్ భారత్ సభ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడటానికి యువతను, కార్మికులను, రైతులను ఏకం చేసి, స్వాతంత్య్రం పొందడానికి గొప్ప కృషి చేసాడని గుర్తు చేసారన్నారు. ఆదివారం భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల 94 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ దోమలగూడ ఏవి కాలేజ్ వద్ద ఉన్న‌ భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల చిత్రపటాలకు డాక్టర్ దిడ్డి సుధాకర్ తో పాటు అప్ నేతలు విజయ్ మల్లంగి, జావేద్ షరీఫ్, రాకేష్, సుధారాణి, రాకేష్ రెడ్డి, అజీమ్ బేగ్, మహమ్మద్ సోహైల్, అహ్సాన్ అహ్మద్, జి.సత్యనారాయణ, కొడంగల్ శ్రీనివాస్, దర్శనం రమేష్, ధర్మేందర్ తివారీ, వైశాలి, జాకీర్, భార్గవి, మౌనిక, అజీమ్ బైగ్, శబాజ్, ఖాన్ తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ… భ‌గ‌త్‌సింగ్‌ పోరాటాలు యువతపై గొప్ప ప్రభావాన్ని చూపాయన్నారు. లాహోర్ కుట్ర కేసు, బ్రిటిష్ అధికారి జాన్ సాండర్స్ హత్య కేసులో భ‌గ‌త్‌సింగ్‌, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరితీశారని, భగత్ సింగ్ ఉరితీత, మరణం దేశంలోని ప్రజలను బాగా ప్రభావితం చేసిందని, అందుకే అతన్ని ప్రేమగా ‘షహీద్ భగత్ సింగ్’ అని పిలుస్తారని అన్నారు. భ‌గ‌త్‌సింగ్‌ పోరాటాల స్ఫూర్తితో దేశ ప్రజలు బ్రిటిష్ నిరంకుశ పాలనను నాడు తరమికొట్టారన్నారు.

ఈనెల 23 భ‌గ‌త్‌సింగ్‌ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబెడ్కర్ జయంతి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి సమస్యలు తెలుసుకొని, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యల పరిష్కరానికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. విజయ్ మల్లంగి మాట్లాడుతూ… భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి విప్లవ నాయకుల నిస్వార్థ త్యాగానికి నేటికి 93 సంవత్సరాలు ఫుర్తయ్యాయని తెలిపారు. జావేద్ షరీఫ్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ గొప్ప విప్లవకారుడే కాదు గొప్ప జర్నలిస్టు కూడా అని, పంజాబ్‌లో ప్రముఖ ఉర్దూ, పంజాబీ వార్తాపత్రికలకు ఎడిటర్‌గా, రచయితగా పని చేశారని గుర్తు చేసారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page