Monday, November 9, 2026
No menu items!
HomeGREATER HYDERABADన‌వీన్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు, అల్పాహారం పంపిణీ

న‌వీన్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు, అల్పాహారం పంపిణీ

📰 Generate e-Paper Clip

బాగ్‌లింగంపల్లి, న‌వంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి డివిజన్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు ఆదివారం ఘ‌నంగా జ‌రిగాయి. బాగ్‌లింగంప‌ల్లిలో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో కేక్‌ కటింగ్‌, అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నవీన్‌ నాయక్‌ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజా సేవే లక్ష్యంగా ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని అల్పాహార పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ ల ఆదేశాల మేర‌కు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదినాన్ని వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్‌ అగర్వాల్‌, అంజి యాదవ్‌, నాగభూషణం, మనోహర్‌రెడ్డి, రాజు, భూపాల్‌, రాములు, బబ్లు, జయకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకర్‌, బాబా షర్ఫుద్దీన్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

Advertisement

Advertisement

You cannot copy content of this page