Monday, November 9, 2026
No menu items!
HomeGREATER HYDERABADమారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు

మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) :

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు ఆదివారం ఘ‌నంగా జ‌రిగాయి. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో ఆంధ్రాకేఫ్ చౌర‌స్తాలో సీఎం రేవంత్ రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి, పండ్ల పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా న‌ర్సింగ్‌రావు మాట్లాడుతూ… రాజ‌కీయంగా ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి ఎద‌గార‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయికీర్త్, పార్టీ నాయ‌కులు శీలం సత్యనారాయణ, మధుమతి, జగదీష్, భాను చందర్, సురేందర్, నవీన్, హఫీజ్, కృష్ణ యాదవ్, మహన్న భీమ బాబూరావు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, సాయిరాం, వెంకటరమణ, ఇర్షాద్ ఫెరోజ్, మురళి, భీమన్నబసని శ్రీనివాస్, వందిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

Advertisement

Advertisement

You cannot copy content of this page