Monday, November 9, 2026
No menu items!
HomeGREATER HYDERABADరేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి – మాజీ డిప్యూటీ మేయ‌ర్ మోతె...

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి – మాజీ డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

తార్నాక‌, న‌వంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) :

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని మాజీ డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి ) మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక‌ల‌కు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఎదగాలని అభిలషించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నూతన శిఖరాలను అధిరోహించాలని ఆమె పేర్కొన్నారు. అలాగే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తూ, రాష్ట్ర ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

Advertisement

Advertisement

You cannot copy content of this page