...

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు శత్రువే – బీసీల బంద్ ను విజయవంతం చేయండి  – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు శత్రువే

– బీసీల బంద్ ను విజయవంతం చేయండి

 – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

హైదరాబాద్, అక్టోబర్ 17, అద్దం న్యూస్ :   బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీల జేఏసీ పిలుపుమేరకు ఈనెల 18వ తేదీన ( నేడు ) నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు శత్రువుగా మారాయన్నారు. శుక్రవారం గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా గోపాల్ మాట్లాడుతూ… భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సైతం బీసీల జనాభా అత్యధికంగా ఉందని, కానీ బీసీలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలో రాగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని… కానీ ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. శనివారం జరగనున్న బీసీల బంద్ లో అత్యవసర సేవలను మినహాయించి అన్ని వాణిజ్య సముదాయాలను మూసివేసి బంద్ లో పాల్గొనాలని కోరారు.

బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో అత్యధికంగా ఉన్న మైనారిటీలు కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు చేసిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలు ప్రచారంలో గుర్తు చేస్తున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.