...

కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ అభివృద్ధికి కృషి చేస్తాం

కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ అభివృద్ధికి కృషి చేస్తాం
– ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైద‌రాబాద్‌, జూన్ 22, ( అద్దం న్యూస్ ) :   రాంన‌గ‌ర్ డివిజ‌న్ కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ అభివృద్ధికి కృషి చేస్తామ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీలో ఆల‌య పునః నిర్మాణం, జిమ్ ఓపెనింగ్ కార్య‌క్ర‌మం సోమ‌వారం రాత్రి జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై ఆల‌య పునఃనిర్మాణం ప‌నుల‌కు శంక‌స్థాప‌న చేశారు. అలాగే జిమ్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ అభివృద్ధి కోసం అధ్య‌క్షుడు వై.శాంతికుమార్ ఎమ్మెల్యే గోపాల్‌కు ప‌లు విజ్ఞాప‌ణ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… బ‌స్తీలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు నిధులు కేటాయిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జ‌య‌సింహా, కృష్ణాన‌గ‌ర్ బ‌స్తీ ఉపాధ్య‌క్షుడు ఈరెల్లి రాజ్‌కుమార్‌, పోచ‌మ్మ ఆల‌యం చైర్మ‌న్‌, బ‌స్తీవాసులు కృపావ‌రం త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.