అభివృద్ధిలో రాజకీయాలు లేకుండా కలిసి పని చేస్తాం
– ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్
హైదరాబాద్, జూన్ 22, ( అద్దం న్యూస్ ) : అభివృద్ధిలో రాజకీయాలతో సంబంధం లేకుండా కలిసి పని చేస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ లు అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని బండమైసమ్మ నగర కమ్యూనిటీహాల్‌లో మరుగుదొడ్ల నిర్మాణం, కొత్త బజార్‌లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు, ఇందిరాపార్కులో చిల్డ్రన్ పార్కులో, వాల్మీకి మోహతార్ సమాజ్ శ్మశాన వాటికలో కనీస వసతుల కోసం, పుల్‌బాగ్, దేవి ప్రసాద్ బాగ్ బస్తీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.2 కోట్లతో నూతనంగా చేపట్టే అభివృ ద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ జి.రచన శ్రీ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నియోజకవర్గంలో అన్ని డివిజన్ల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. పార్టీలు వేరైనా ప్రజల కోసం అందరం కలిసి నిధులను తెప్పించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు జి.వెంకటేష్, ముఠా జైసింహా, ముచ్చకుర్తి ప్రభాకర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply