హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిఎన్.చారి ఆధ్వర్యంలో అంబేద్కర్‌నగర్ ఓం కాలనీ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచన శ్రీ హాజరై పార్టీ జెండానావిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిజెపితోనే సామాన్యుడికి సమ న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో భవిష్యత్ అంతా బిజెపిదే అని అన్నారు. రోజు రోజుకు బిజెపి పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమేష్, జి.వెంకటేష్, డివిజన్ అధ్యక్షుడు దిలీప్ యాదవ్, బిజెపి ఓబిసి మోర్చ సోషల్ మీడియా కో-కన్వీనర్ తోలుపునూరి రమేష్‌గౌడ్, సీనియర్ నాయకులు పరిమల్‌కుమార్, సురేష్ ముదిరాజ్, లింగంగౌడ్, ప్రేమ్, ఆంజనేయులు, ప్రభాకర్, గంట శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply