Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadక‌వాడిగూడ‌లో బిజెపి ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

క‌వాడిగూడ‌లో బిజెపి ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్    భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్‌లో పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు పిఎన్‌.చారి ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్‌న‌గ‌ర్ ఓం కాల‌నీ వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ హాజ‌రై పార్టీ జెండానావిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిజెపితోనే సామాన్యుడికి స‌మ న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ‌లో భ‌విష్య‌త్ అంతా బిజెపిదే అని అన్నారు. రోజు రోజుకు బిజెపి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయ‌కులు ర‌మేష్‌, జి.వెంక‌టేష్‌, డివిజ‌న్ అధ్య‌క్షుడు దిలీప్ యాద‌వ్‌, బిజెపి ఓబిసి మోర్చ సోష‌ల్ మీడియా కో-క‌న్వీన‌ర్ తోలుపునూరి ర‌మేష్‌గౌడ్‌, సీనియ‌ర్ నాయ‌కులు ప‌రిమ‌ల్‌కుమార్‌, సురేష్ ముదిరాజ్‌, లింగంగౌడ్‌, ప్రేమ్‌, ఆంజనేయులు, ప్ర‌భాక‌ర్‌, గంట శ్రీనివాస్‌, రాము త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page