Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadమాజీ కేంద్ర మంత్రి టైగర్ ఆలె నరేంద్ర చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన కార్పొరేట‌ర్ పావ‌ని...

మాజీ కేంద్ర మంత్రి టైగర్ ఆలె నరేంద్ర చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్‌

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్త, మాజీ కేంద్ర మంత్రి దివంగ‌త‌ టైగర్ ఆలె నరేంద్ర వర్ధంతి కార్య‌క్ర‌మం బుధవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ఎ.పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజ‌రై డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి ఆలె నరేంద్ర చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… తెలంగాణ సాధన పోరాటంలో ఆలె నరేంద్ర కీలక పాత్ర పోషించార‌న్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా, మాజీ కేంద్ర మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలను అందించారని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా టైగర్ నరేంద్ర కలలను సాకారం చేసుందుకు తాము ముందుకు సాగుతున్నమ‌న్నారు. నరేంద్ర స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు ప్రజాభ్యున్నతికి కృషి చేయాలని కార్పొరేటర్ పావ‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అద్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, అశోక్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సురేష్, లక్ష్మణ్ యాదవ్, దోనేటి సత్యం, డి.కుమార్, రహామత్ అలి, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page