సిద్ధాంతం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీనే
– బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
అంబర్పేట్, అద్దం న్యూస్ : నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బిజెపేనని, దేశ ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చినందుకు నరేంద్రమోదీ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు . భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నగర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ తో కలిసి బీజేపీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత 1984వ సంవత్సరంలో జరిగిన లోకసభ ఎన్నికలలో బీజేపీ కేవలం రెండు స్థానాలలోనే విజయం సాధించగా నేడు కేంద్రంలో అధికారంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగానే చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూరాలనే ఆలోచనతోనే బీజేపీ ముందుకు సాగుతుందన్నారు . సీనియర్ నేత గౌతమ్ రావు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహాంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్, ఆనంద్ గౌడ్, ఓ.శ్రీనివాస్ రెడ్డి, కార్పోరేటర్ ఉమా రమేష్ యాదవ్, శ్యామ్ సుందర్ గౌడ్, సందీప్ సాయి, అనంత లక్ష్మి, కీర్తి రెడ్డి, వినోద్ యాదవ్, వనం రమేష్, సూర్య ప్రకాష్ సింగ్, రవీందర్, హరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply