బిజెపి సీనియర్ నాయకుడు నర్సింగ్ రావు గౌడ్ సేవలు మరువలేనివి
– మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, ఆగస్టు 19, అద్దం న్యూస్ : బిజెపి సీనియర్ నాయకుడు నర్సింగ్ రావు గౌడ్ సేవలు మరువలేనివని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకుడు మచ్చన్‌పల్లి నర్సింగ్‌రావు గౌడ్ జయంతి కార్యక్రమం మంగళవారం ముషీరాబాద్‌లో జరిగింది. బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చన్‌పల్లి కుశాల్‌గౌడ్, మచ్చన్‌పల్లి వరలక్ష్మీ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై నర్సింగ్‌రావు గౌడ్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నర్సింగ్‌రావు గౌడ్ పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వినుత, కంచి కుమార్ ముదిరాజ్, ప్రవీణ్, సాయి శషాంక్, సారంగపాణి, బద్రి నారాయణ, జమాల్‌పూర్ నందు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply