భవిష్యత్‌లో తెలంగాణలో బిజెపిదే రాజ్యం
– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీ
హైదరాబాద్, అద్దం న్యూస్ : భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపిదే రాజ్యమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీ అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ రాంనగర్ ఈ సేవా వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీ హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రధాన మంత్రి మోడి చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్, బిజెపి అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు పాశం సాయికృష్ణయాదవ్, సీనియర్ నాయకులు కౌండిన్య ప్రసాద్, శేషసాయి, నందు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply