Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADజనప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

జనప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

జనప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 హైదరాబాద్, మార్చి 15, అర్థం న్యూస్ :   ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లోని జనప్రియ అబొడ్స్ అపార్ట్‌మెంట్‌ నివాసులు, జనప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఆదివారం అపార్ట్‌మెంట్‌ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. 

ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర వైద్యం అందించే క్రమంలో రక్తం అందక అనేక సందర్భాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయియిన వార్తలు తరచు వింటుంటామన్నారు. రక్త దానం…ప్రాణ దానంతో సమానమైనదని, ఈ శిబిరాన్ని ఏర్పారు చేసిన జనప్రియ అబొడ్స్ వాకర్స్ క్లబ్ వారికి అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ 301 గవర్నర్ గంగాధర్ రెడ్డి, అధ్యక్షుడు నాగేందర్, నిరంజన్, హరి ప్రసాద్, మురళి కృష్ణ, నాగభూషణం, లింగ ప్రకాష్, శ్రవణ్ కుమార్, మనోహర్ రెడ్డి, జనప్రియ అబొడ్స్ అసోసియేషన్ అధ్యకుడు స్వామి దాస్, మల్లేష్, ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page