Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బొల్లంపల్లి రాంరెడ్డి నియామ‌కం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బొల్లంపల్లి రాంరెడ్డి నియామ‌కం

📰 Generate e-Paper Clip


హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :    భార‌తీయ జ‌నతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బొల్లంప‌ల్లి రాంరెడ్డి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్ర అధ్య‌క్షుడు రామచంద‌ర్‌రావు ప్ర‌క‌టించారు. బొల్లంప‌ల్లి రాంరెడ్డి గ‌త మూడు ద‌శాబ్దాలకు పైగా బిజెపిలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తున్నారు. డివిజ‌న్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయ‌కుడిగా పద‌వుల‌ను పొంది పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. ఆయ‌న తాజాగా బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా బొల్లంప‌ల్లి రాంరెడ్డి మాట్లాడుతూ… పార్టీ కోసం అంకిత భవంతో 38 సంవత్సరాలుగా పని చేస్తున్న న‌న్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రకటించినందుకు నా రాజకీయ గురువు, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద‌ర్‌రావుకు, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు తెలిపారు. పార్టీని న‌మ్ముకొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. పార్టీ కోసం ఎల్లప్పుడు కృషి చేస్తున్న నేను రెట్టింపు ఉత్సాహంతో ప‌ని చేస్తాన‌న్నారు. కార్యవర్గ సభ్యుడిగా త‌న‌ను ప్రకటించడమే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంద‌ని అన‌డానికి ఇదే నిదర్శనమని రాంరెడ్డి తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page