Saturday, September 19, 2026
No menu items!
HomeAPజగన్ మూకల గూండాగిరిని సహించం – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్...

జగన్ మూకల గూండాగిరిని సహించం – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్

📰 Generate e-Paper Clip

జగన్ మూకల గూండాగిరిని సహించం
– టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :    హైదరాబాద్‌లోని ఓ ప‌త్రిక కార్యాలయంపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడిని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయకులు తీవ్రంగా ఖండిచారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆ పార్టీ నేతలు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు మాట్లాడుతూ… మీడియాపై భౌతిక దాడులు దుర్మార్గమ‌ని అన్నారు. వైసీపీ నేతలు ఆందోళన ముసుగులో భౌతిక దాడులకు దిగడం, కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. వైసీపీ 151 సీట్ల నుంచి 11 పడిపోయినా జగన్ అండ్ కో లో మార్పు రాకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page