గాంధీనగర్‌లో ఘనంగా బోనాల జాతర
– బోనాల ఉత్సవాలకు హాజరైన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ : ఆషాడ మాసం బోనాల జాతర వేడుకలు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్‌లోని అమ్మవార్ల దేవాలయాల్లో జరిగిన బోనాల ఉత్సవాలకు స్థానిక కార్పొరేటర్ పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి పూజలు చేశారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్టు కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, విష్ణు ప్రసాద్, పి.నర్సింగ్ రావు, సత్తి రెడ్డి, శివ కుమార్, సురేష్, లక్ష్మణ్ యాదవ్, నర్సింహ, సాయి కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సంతోష్, ఆకుల అభిషేక్, ప్రశాంత్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply