మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు

మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు

తార్నాక‌, ఆగ‌స్టు 5, ( అద్దం న్యూస్ ) :  ఆషాఢ మానపు బోనాల జాతరలో భాగంగా బుధవారం తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బుధ‌వారం ఐఎన్‌టియూసి గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తొలుత యూనియన్ ఆఫీసులోని అమ్మవారికి సాంప్రదాయబద్దంగా పూజాధికాలను నిర్వహించినానంతరం ఊరేగింపుగా, పోతరాజుల నాట్య విన్యాసాలతో ఎంఎంసీ ఆవరణలో గ‌ల‌ అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాలకు కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ… బోనాలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో యూనియన్ ఆధ్వర్యంలో సాంప్రదాయంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. క్యూర్ సిటీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోన పర్మినెంట్ ఉద్యోగులు, ఔట్ సోర్స్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ పోరాటం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియూసి జనరల్ సెక్రటరీ ఏవీఎస్ గాంధీ, అడిషనల్ జనరల్ సెక్రటరీ కె.శివకుమార్, ఉమెన్స్ కమిటీ చైర్ పర్సన్ ఎల్.మెర్సీ, జోనల్ ప్రెసిడెంట్లు కె.రాజు, ఎంఎంసీ ఇన్ఛార్జి వై.యాదగిరి, ఎస్సీ, ఎస్టీ విభాగం వైస్ ప్రెసిడెంట్ పల్లవి తో పాటు నేతలు ఖాజా పాషా, పీఎస్.ఉమేశ్ బాబు, జి.శివకుమార్, జీవన్ కుమార్, రమేశ్, శివరాజ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page