తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని సాధించి, రాష్ట్రం పురోగతి సాధించిన గులాబీ జెండా 25 వసంతాలు పూర్తి చేసుకుని 26 వసంతంలోకి అడుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ( BRS ) జెండా పండుగ వాడవాడలా పండుగలా కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లల్లో పార్టీ ఆవిర్భా వేడుకలు జరిగాయి. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బాపూజినగర్ డివిజన్ పార్శిగుట్ట చౌరస్తాలో పార్టీ ఆవిర్భావ వేడుకలు, పేదలకు బటర్ మిల్క్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జైసింహా హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పేదలకు బటర్ మిల్క్ ప్యాకెట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండ శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ నాయకులు సత్యనారాయణ బాబు, చింటు ( ప్రభాస్ ), టిల్లు, పరుశురామ్ యాదవ్, దీన్ దయాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply