ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ల ఆధ్వర్యంలో
ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 14 వరకు భగత్‌సింగ్, బి.అర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్యం పై బడ్జెట్‌ను పెంచాలి
– ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్, అద్దం న్యూస్ : విద్య, వైద్యం ప్రధాన అంశంగా ఆప్ పని చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. గత వారం రోజులుగా నగరంలోని హిమాయత్‌నగర్, రామ్‌నగర్, చంపాపేట, సాయిబ్‌నగర్, బిఎన్.రెడ్డినగర్, రామంతాపూర్‌లోని వివిధ ప్రభుత్వ ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే చేసింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ… మన రాజ్యాంగ నిర్మాత విద్య పొందడం అందరి హక్కు అని.. ప్రభుత్వం నాణ్యమైన విద్య, వైద్యాలని అందరకి ఉచితంగా అందచేయాలని రాజ్యాంగంలో పొందు పరిచారన్నారు. కానీ ఆచరణలో అది జరగడం లేదన్నారు. మన రాష్ట్రంలో విద్య కోసం బడ్జెట్‌లో 7.5 శాతం మాత్రమే కేటాయించారని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా 15 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. క్లాసురూములు టేచర్లు ఉన్నా, దాదాపు అన్ని పాఠశాలల్లో మంచి నీరు, పారిశుద్ధ్య కార్మికులు, అటెండర్లు, స్పోర్ట్స్ వసతులు సరిగా లేవన్నారు. దాదాపు అన్ని స్కూల్స్ ప్రైవేటు డోనర్ల సహాయంతో నడుస్తున్నట్లు తెలుస్తున్నదని తెలిపారు.
మిడ్ డే మీల్స్ వల్ల కొద్దిగా ప్రయోజనం ఉన్నా బాల బాలికలకు ఇంకా బల వర్ధకమైన ఆహారం అందే ఏర్పాట్లు చేయాలన్నారు. స్కూల్ యునిఫారంలు ఇస్తున్నా… కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంతో మంది బాల బాలికలను చూస్తె బాధ వేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. నగరంలోనే ఇటువంటి పరిస్థితి వుంటే జిల్లాలలో, గ్రామాలలో ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ల ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 94 వర్ధంతి రోజు ఈ నెల 23 నుండి రాజ్యాంగ నిర్మాత బిఅర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాలు, దవాఖానాల సర్వే చేయడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 15 న ఆయా జిల్లాల కలక్టర్‌లకు అక్కడి స్కూల్స్, దవాఖానాల పరిస్థితి వివరిస్తూ మెమొరాండంల సమర్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విద్య వైద్య రంగాలలో బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందు పరచిన విధంగా 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 17 వ తేదీన ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందని సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు విజయ్ మల్లంగి, మహిళా నాయకురాలు సుధారాణి, జావీద్, షరీఫ్, దొరపల్లి సతీష్ కుమార్, రాకేశ్ రెడ్డి, బాబులాల్ పవార్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
Leave a Reply