గాంధీన‌గ‌ర్‌లో రావణాసురుని దహనం – పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

గాంధీన‌గ‌ర్‌లో రావణాసురుని దహనం

– పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 3, అద్దం న్యూస్ :    చెడుపై మంచి తప్పక విజయం సాధించి తీరుతుందనడానికి ప్రతీక విజయదశమి అని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ఎస్ఆర్‌టి శ్రీ పోచమ్మ- శ్రీ ఉప్పలమ్మ తల్లి దేవాలయం, చిక్కడపల్లి బాపూనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసన కార్యక్రమాల‌కు ముఖ్య అతిథిగా విన‌య్ కుమార్ హాజ‌ర‌య్యారు. రావణసూరిని భారీ ప్రతిమకు నిప్పు పెట్టి విజయదశమి వేడుకలు జరిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో సకల సుఖాలు ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తున్నానని విన‌య్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దామోదర్, మహమూద్, భరత్, చిర్ర యాదగిరి, నీరజ్,అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సంపత్ యాదవ్, ప్రశాంత్, వేడుక నిర్వాహకులు బింగి సాయి కీర్త్, వినయ్, శివ ప్రసాద్, కె.సాయి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page