హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకుడు కడప సురేందర్ ఆధ్వర్యంలో మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. డివిజన్‌లోని అచ్యుత్‌రెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి అడిక్‌మెట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు పాశం సాయికృష్ణ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయికృష్ణయాదవ్, కడప సురేందర్ లు మాట్లాడుతూ… ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అడిక్‌మెట్ విద్యానగర్ రోడ్డు మార్గంలో వచ్చేపోయే వాహనదారులకు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయి, బిజెపి పాయకులు కిషోర్, గణేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply