బషీర్‌బాగ్, మే 30, అద్దం న్యూస్ : గద్దర్ ఫిలిం అవార్డులను రద్దు చేయాలని తెలంగాణ సినిమా వేదిక ( టీసీవి ) డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో గద్దర్ పేరిట ప్రకటించిన అవార్డ్స్ అంశం పై విలేకరుల సమావేశం జరిగింది. తెలంగాణ సినిమా వేదిక కో–కన్వీనర్ మోహన్ బైరాగి అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో టిసివి గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, సినీ దర్శకులు ఎండి రఫీ, సీనియర్ జర్నలిస్ట్ స్కై బాబా, టిసివి రాష్ట్ర కన్వీనర్ లారా, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు సుధాకర్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ఆంధ్ర పెద్దల కనుసనల్లో జరిగిందన్నారు. 2014 నుండి చేసిన అవార్డుల ఎంపిక సరైంది కాదని, గద్దర్ ఫిలిం అవార్డులను వెంటనే రద్దు చేసి, కమిటీ వేసి తెలంగాణ సినిమాలకే గద్దర్ ఫిలిం అవార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సినిమా అవార్డు ఎంపికలో ఆంధ్ర వాళ్ళు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. తెలంగాణ కవులు కళాకారులు, సినిమా రచయితలు, ఆర్టిస్టులు అందరూ తెలంగాణ సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు తెలంగాణ సినిమా రంగం విభజన జరగలేదని, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు కోరలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమాకు జరుగుతున్న అన్యాయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోతే తగు గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమం లో మురళీధర్ దేశపాండే, పంజాలా శ్రవణ్ గౌడ్, రవి, హరి, అరుణ, సుజి, ప్రసాద్, బాలు నాయక్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply