Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జ‌యించ‌వ‌చ్చు

ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జ‌యించ‌వ‌చ్చు

📰 Generate e-Paper Clip

ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జ‌యించ‌వ‌చ్చు
» ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ కంపైనర్ తుషిత పార్థ‌సార‌థి

హైద‌రాబాద్‌, జూలై 11, ( అద్దం న్యూస్ ) :   ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్‌ను జయించవచ్చని ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ కంపైనర్ తుషిత పార్థ‌సార‌థి పేర్కొన్నారు. శనివారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ ల‌లితాన‌గ‌ర్‌ రాంనగర్ గుండూలోని దీక్ష హైస్కూల్ డైరెక్టర్ గోవిందరాజు బండారు ఆధ్వర్యంలో విద్యార్థినీ, వారి తల్లిదండ్రులకు క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆమె మాట్లాడుతూ… తన తల్లి చిన్న వయసులోనే క్యాన్సర్‌తో పోరాడి జ‌యించింద‌న్నారు. ఆ స‌మ‌స్య‌ను ఇతరులు ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో గత అయిదు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే విద్యార్థినీ, వారి తల్లిదండ్రులకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు తెలిసిన వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చని పేర్కొన్నారు. క్యాన్సర్ సోకిన మహిళలకు తోటి మహిళలు, యువతులు మానవత్వంతో తమ తలవెంట్రులను వారికి ఇవ్వాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో క్యాన్సర్ పట్ల పిల్లలకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో దీక్ష స్కూల్ ప్రిన్సిపాల్ కవిత, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.భూమిక, ప్రియాంక టీచర్లు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తమ వెంట్రుకలు దానం చేయడానికి ముందుకు వచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page