Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADసిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి – గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని

సిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి – గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని

📰 Generate e-Paper Clip

సిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి
– గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని

హైదరాబాద్, మార్చి 30, అద్దం న్యూస్ :   నూత‌నంగా ప్రారంభ‌మైన‌ సిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని అధికారుల‌ను కోరారు. డివిజ‌న్‌లోని అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో గ‌తంలో ప్రారంభించిన సిసి రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్‌, వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం వెంక‌ట్ రెడ్డి, లైన్ ఇన్‌స్పెక్ట‌ర్ శంక‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి సోమ‌వారం మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని ప‌రిశీలించారు. బస్తీవాసుల ఫిర్యాదు మేరకు పనులు నత్తనడకన సాగుతున్నాయని, త్వరగతిన‌ పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ పావ‌ని అధికారులను కోరారు. సిసి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి మరో వారం రోజుల్లో ప్రజల అందుబాటులోకి తెస్తామని, అలాగే పూర్తైన పైప్‌లైన్ పనుల అనంతరం మిగిలి ఉన్న రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు సైతం వెంటనే పూర్తి చేయాలని వాటర్ వర్క్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి సీనియర్ నేతలు శ్రీకాంత్, ఎం.ఉమేష్, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, బస్తీవాసులు శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్, సతీష్, పవన్, బాబీ, కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page