Friday, September 18, 2026
HomeGREATER HYDERABADసెంట్రింగ్ కార్మికుల సమ్మె విరమణ

సెంట్రింగ్ కార్మికుల సమ్మె విరమణ

సెంట్రింగ్ కార్మికుల సమ్మె విరమణ
– న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగుతుంది

హైద‌రాబాద్‌, మే 29, ( అద్దం న్యూస్ ) :   సెంట్రింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని, సమ్మెను విరమిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.కృష్ణ, చైర్మన్ ఎస్.పరశురాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా వెల్లడించారు. శుక్రవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. స్క్వేర్ ఫీట్‌కు రూ.51 చెల్లింపును బిల్డర్స్ అసోసియేషన్ ఆమోదించిందని తెలిపారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో చర్చించాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులకు గుర్తింపు కార్డుల మంజూరుకు కార్మిక శాఖ కమిషనర్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమ్మెకు మద్దతు తెలిపిన కాంట్రాక్టు కార్మికులు, మేస్త్రీలు, అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా డిమాండ్ల సాధనకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి ఆకుల ప్రవీణ్ కుమార్, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కమలాకర్ రాజు గౌడ్, మహమ్మద్ అహమ్మద్, బోరబండ మక్సుద్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page