హైదరాబాద్, అద్దం న్యూస్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించి ఆదివాసీలను కాపాడాలని భారత్ బచావో సభలో మేధావులు రాజకీయ నాయకులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత్ బచావో ఆధ్వర్యంలో కాల్పుల విరమణ కై మద్దతుగా సభ జరిగింది. ఈ సభలో ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ హరగోపాల్, ఆదివాసీ నాయకురాలు సోనీ సోరి, మాజీ ఎంపీ మధుయాష్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ మధ్య జరుగుతున్న యుద్ధంలో నక్సల్స్ పేరుమీద అత్యధికంగా ప్రాణాలు కోల్పోతుందని ఆది వాసీలే అని అన్నారు. బస్తర్ లో ప్రజలు అమాయక వాతావరణంలో బ్రతుకుతున్నారని రాజ్యాంగంలో ఆధివాసిలకు పొంధుపర్చిన షెడ్యూల్ 5, 6 లను ప్రభుత్వం కఠినంగా అమలు పరచాలని అన్నారు. మేధావుల సమక్షమాలో ఏర్పడ్డ ప్లానింగ్ కమిటీ రిపోర్ట్ ని సమీక్షచలాని, ఆదివాసిల పట్ల మానవీయంగా వ్యవహరించాలని మావోయిస్ట్ పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి బస్తర్ లో కాల్పుల విరమణ జరపాలని అన్నారు. ఆదివాసీలను రక్షించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు ప్రజాసంఘాలపైనే ఉందని ప్రకృతి ప్రేమికులను మనం కాపాడుకోకపోతే ప్రకృతి సర్వనాశనానికి దారితీస్తుందన్నారు. పచ్చని చెట్ల మధ్య తుపాకుల తూటాల చప్పుడులకు తావు లేదన్నారు. ప్రజా సంఘాల ఏకమై ఆదివాసీల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఆదివాసీ నాయకురాలు సోనీ సోరి మాట్లాడుతూ… బస్తర్ లో ప్రబుత్వల మధ్య మావోయిస్ట్ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎక్కువగా నష్టపోతుంధి ఆదివాసీలే బస్తర్ లో సల్వా జుడుమ్, ఇతర పేరుల మిధ్య అధివశీల మిధ విపరీతమైన హింస జరుతుందన్నారు. నక్సల్స్ పేరు మిధ్య ఆదివాసిలను చంపుతున్నారన్నారు ఆదివాసీలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలు ఆధివాసిల పట్ల కపట ప్రేమను చూపిస్తున్నాయని.. ఒకవేల ఈ సమయంలో శాంతి చర్చలు జరగకపోతే బస్తర్, ఆధివాసిలు రెండు మిగలవు బస్తర్ లో ఎక్కడ చూసిన పోలీస్ క్యాంపులే ఉన్నాయని.. మణిపూర్ లాంటివ్ ఘటనలు బస్తర్లో ప్రతిరోజూ జరుగుతున్నాయని తెలిపారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండురాం మాట్లాడుతూ… ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలని ఒకవేళ ఆ పరిధి దాటి పనిచేస్తే ప్రభుత్వాలకి హానికరం అన్నారు. మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన చర్చలను నేను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కార్యకర్తలు ముగ్గురు చనిపోతే మిగతా వారంతా సాధారణ ఆదివాసులు అని అమాయక ఆదివాసీలు చనిపోతుంటే ఇంకా చర్చలకు ముందుకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. చర్చలకు రెండు వర్గాలు ముందుకు రావాలని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి భక్త చరణ్ దాస్, ప్రాణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, మానవహక్కుల కార్యకర్త బేలా భాటియా, అరుణోదయ సాంస్కృతిక సమైక్య విమలక్క, జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్, ప్రొఫెసర్ సీతారామారావు, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, మౌలానా ఆజాద్, తెలంగాణ ట్రైబల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఎండి రియాజ్, ముస్లిం థింకర్స్ ఫోరం స్కై బాబ, తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజలు చైర్మన్ జంగా రాఘవరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply