Friday, September 18, 2026
HomeHyderabadజ‌న‌గ‌న‌ణ‌లో కుల గణన పై కేంద్ర ఆమోదం హ‌ర్ష‌ణీయం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్...

జ‌న‌గ‌న‌ణ‌లో కుల గణన పై కేంద్ర ఆమోదం హ‌ర్ష‌ణీయం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

జ‌న‌గ‌న‌ణ‌లో కుల గణన పై కేంద్ర ఆమోదం హ‌ర్ష‌ణీయం

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :   జనాభా లెక్కలతో పాటుగా కుల గణన కూడా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. గురువారం న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సూచనలతోనే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని సాయిబాబా అన్నారు. బీసీ కులగణనకు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని స్వాగతిస్తూ….. హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల గడువు ముగిసి సంవత్సరం పైబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలేద‌న్నారు. కులగణన సాకుతో స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. అంతేగాని బీసీలపై ఎటువంటి ప్రేమ కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా కులణన చేపడితే, తప్పులున్నాయని ప్రజలు తిరగబడడంతో మళ్లీ రీసర్వే నిర్వహించి, కులగణనా రిపోర్టును ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదన్నారు.

తెలంగాణా కాంగ్రెస్ దేశానికే ఆదర్శమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులను దేంట్లో ఆదర్శంగా తీసుకోవాలని ప్రశ్నించారు. అవినీతిలో ఆదర్శంగా తీసుకోవాలా, జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలా ? లేక కుదేలైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆదర్శంగా తీసుకోవాలా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు విధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి నిరూపించు కోవాలన్నారు. అద్దాల మేడలో కూర్చొని ఇతరులపై రాళ్లు రువ్వతే మీకే చేటు అని సాయిబాబా అన్నారు. బీసీలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించి చైతన్య పరిచింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని గుర్తు చేశారు. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకోకుండా, స్వచ్ఛందంగా స్వయం సహాయక బృందాలతో గ్రామ సంఘాలను సామాజిక సేవా సంస్థలను వాడుకొని కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని, ఏదో మొక్కుబడిగా చేయకుండా, చేశామని చేతులు దులుపుకోకుండా పూర్తిస్థాయిలో కులగణన నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page