నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోంది – కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంచార్జ్ అదం సంతోష్

 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోంది

 

– కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంచార్జ్ అదం సంతోష్

స‌న్న‌బియ్యంతో వండిన భోజ‌నం చేస్తున్న ఆదం సంతోష్‌

                                      స‌న్న‌బియ్యంతో వండిన భోజ‌నం చేస్తున్న ఆదం సంతోష్‌

సికింద్రాబాద్, మే 1, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో గురువారం నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం ఎంతో చేయూత ఇస్తుందని, రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యులకి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వలన లబ్ధిదారులు ఎవరు తినేవారు కాదని అది గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై భారం పడినప్పటికీ సన్న బియ్యం పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

పది సంవత్సరాలు రేషన్ కార్డులు పంపిణీ చేయక పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయని ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు అందుతాయని పేర్కొన్నారు. కార్డులు కలిగిన వారందరికీ సన్న బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అదం సంతోష్ బౌద్ధ‌న‌గ‌ర్ డివిజన్ సంజీవపురంలో సన్నబియ్యం లబ్ధిదారు లలిత ఇంట్లో భోజనం చేశారు, వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సన్న బియ్యం పథకంపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో షకీల్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు అనిల్, బ్రహ్మాజీ, అభిషేక్, రవి, జలందర్ రెడ్డి, కిషోర్ యాదవ్, రవి శంకర్, వహీద్, శ్రీనివాస్, బబ్లూ, చక్రి, అబ్బు బాయి, హరి, ప్రభాకర్, రాధ, కల్పన, రమణి, రాంలీలా తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page