దేశ్‌ముఖ్, దొరల అక్రమ, ఆధిపత్య దురంహకార చర్యలను తిప్పికొట్టిన పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ
– ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 26, అద్దం న్యూస్ : దేశ్‌ముఖ్, రెడ్డి భూస్వాముల, దొరల అక్రమ, ఆధిపత్య దురంహకార చర్యలను తిప్పికొట్టిన పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ అని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముదిగొండ మురళి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రాంనగర్ చౌరస్తాలో వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెడ్డి భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా అదే సామాజిక వర్గం వారైన రెడ్డిలతో కలిసి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేశారన్నారు. చాకలి ఐలమ్మ జీవితం అంటేనే ఒక పట్టుదల, సమూహ బలమన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బి.వెంకటయ్య, జి.శ్రీనివాస్, ఎం.మహేష్, పి.జనార్థన్, వెంకటేష్, బంగారు శ్రీనివాస్, రాము, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, శంకర్, దామోదర్, గోక నవీన్, జ్ఞానేశ్వర్, ప్రభాకర్, అరుణ్, విజయక్రిష్ణ, రాజేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply